'Oka Raju, Eduguru Kodukulu' Story (King and his Seven Sons)

Most of people don't know the full story of 'Oka Raju, Eduguru Kodukulu' (King and his Seven Sons). Most of people remember half of story. Here you can get the full story of Kind and his Seven Sons. Let's have a look on the story. We provide more small stories like this. Stay tuned to Vizzva  

అనగనగా ఒక ఊరికి ఒక రాజు గారు ఉండేవారు. ఆయనకి ఏడుగురు కొడుకులు ఉండేవారు. ఒక రోజు ఆ ఏడుగురు కొడుకులు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. ఆ తెచిన చేపలని ఎండబెట్టారు.
సాయంత్రానికి ఆరు చేపలు ఎండాయ్ కాని, ఏడో చేప ఎండలేదు.
ఆ చేపని  పట్టిన రాజకుమారుడు చేపని "చేప చేప ఎందుకు ఎండలేదు" అని అడిగాడు.
అప్పుడు ఆ చేప "గడ్డి మోపూద్డమొచ్చింది" అని బదులు చెప్పింది.
ఆ రాజకుమారుడు వెళ్ళి గడ్డిమోపు ని " నా చేప ఎండకుండా ఎందుకు అడ్డం వచ్చావ్?" అని అడిగాడు. అప్పుడు గడ్డిమోపు "ఈరోజు ఆవు నన్ను మేయడానికి రాలేదు" అని అంది.
రాజకుమారుడు వెంటనే ఆవు దగ్గరికి వెళ్ళి "ఆవు ఆవు ఈ రోజు నువ్వు గడ్డి ఎందుకు మేయలేదు?" అని అడిగాడు.
ఆవు "నన్ను ఈరోజు పాలేరు తీసుకెళ్ళలేదు" అని చెప్పింది. రాజకుమారుడు పాలేరు ని "ఎందుకు ఈరోజు ఆవుని గడ్డి మేయడానికి తీసుకెళ్ళలేదు" అని  అడిగాడు. పాలేరు "అమ్మ నాకు అన్నం పెట్టలేదు " అని అన్నాడు. రాజకుమారుడు అమ్మని అడిగితే అమ్మ "అక్కడ పాప ఏడుస్తుంది" అన్నది. రాజకుమారుడు పాపని "పాప పాప ఎందుకు ఏడుస్తున్నవు?" అని అడిగితే పాప "నన్ను చీమ కుట్టింది" అని ఏడుస్తూ చెప్పింది.
రాజకుమారుడు ఆకరికి చీమని కూడా "చీమ చీమ పాపని ఎందుకు కుట్టావ్?" అని అడిగాడు. అప్పుడు చీమ "నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా!" అని అంది.

నీతి: ఎవరి పనుల్లో అనవసరం గా జోక్యం చేసుకోకూడదు. ఒక వేళ చేస్తే దాని ప్రభావం మన మీద పడుతుంది
Moral of the Story: Don't intrude in others matters if we did it effect on us

Comments

Popular posts from this blog

What is ISI (BIS) Mark on Products & How to detect Genuine ISI Mark?

Srimanthudu (2015) - Wallpapers, Posters, Stills [ALL]

Barrister Parvateesam Novel - Read / Download / About